రివ్యూ: ఖాకీ

రివ్యూ: ఖాకీ

కొత్త కొత్త కథలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే హీరో కార్తి.. ‘ఖాకీ’ పేరుతో మరో సినిమా చేశాడు. యధార్ధ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ ఖాకీ ఆడియన్స్ ను ఎంతవరకు మెప్పించాడో.. సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం!

కథ:
పోలీస్ డిపార్ట్మెంట్ లో కొత్తగా జాయిన్ అవుతాడు ధీరజ్(కార్తి). తన నిజాయితీతో మంచి పేరు తెచ్చుకుంటాడు. ప్రతి కేసును సమర్ధవంతంగా పరిష్కరించే ధీరజ్.. చేతికి ఒక కేసు వస్తుంది. ఇళ్ళల్లో చొరబడి దోపిడీలకు పాల్పడుతూ దారుణంగా హత్యలు చేస్తుంటుంది ఒక ముఠా. వాళ్ళను పట్టుకునే బాధ్యత ధీరజ్ కు అప్పగిస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్. మరి ధీరజ్ వాళ్ళను పట్టుకున్నాడా..? ఈ కేసు కారణంగా ధీరజ్ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు..? అనే విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే!

కథ, కథనం, దర్శకత్వం:
డబ్బు కోసం భయంకరంగా హత్యలు చేసే ముఠా వారిని పట్టుకోవడమే లక్ష్యంగా చేసుకున్న పోలీసులు.. వీరి మధ్య నడిచే పోరాటే సన్నివేశాలతో సినిమా మొత్తం నడుస్తుంది. తెలుగులో ఇప్పటికే పోలీసు కథలతో చాలా సినిమాలు వచ్చినప్పటికీ ఖాకీ వాటన్నింటికీ కాస్త ప్రత్యేకమనే చెప్పాలి. నిజ జీవితంలో జరిగిన సంఘటనలను ఆధారంగా చేసుకొని దర్శకుడు రాసుకున్న కథను మెచ్చుకోవాల్సిందే. ఈ కథ కోసం దర్శకుడు చేసిన రీసెర్చ్ ప్రతి సన్నివేశంలో కనిపిస్తుంది. ఒక కేసు మీదే సినిమా మొత్తం తిరుగుతుంది కాబట్టి కథలో ఎలాంటి మలుపులు ఉండవు. కొన్ని చోట్ల సినిమా సాగదీసిన భావన కలుగుతుంది. సెకండ్ హాఫ్ లో వచ్చే ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.

నటీనటుల పనితీరు:
పోలీస్ ఆఫీసర్ పాత్రలో కార్తి ఒదిగిపోయాడు. తన లుక్స్ కుస ఆకట్టుకున్నాయి. యాక్షన్ సన్నివేశాల్లో బాగా నటించాడు. రకుల్ తో కార్తి కాంబినేషన్ సీన్లు ఎంటర్టైన్ చేస్తాయి. అభిమన్యు సింగ్ తన లుక్ తో భయపెట్టాడు. కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. జిబ్రాన్ సంగీతం సినిమాకు ప్లస్ అయింది. ఎడిటింగ్ వర్క్ బాగుంది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్లుగా ఉన్నాయి.
రేటింగ్: 3/5

COMMENTS

X