రివ్యూ: ఎంసిఏ(మిడిల్ క్లాస్ అబ్బాయి)

రివ్యూ: ఎంసిఏ(మిడిల్ క్లాస్ అబ్బాయి)

నటీనటులు: నాని, సాయి పల్లవి, విజయ్ వర్మ, భూమిక తదితరులు
దర్శకత్వం: వేణు శ్రీరామ్

నాని సినిమా అంటే చాలు.. బొమ్మ హిట్టు అనే ఫీలింగ్ చాలా మందిలో ఉంది. కథ, కథనాల సంగతి ఎలా ఉన్నా.. తన న్యాచురల్  పెర్ఫార్మన్స్ తో సినిమాను గట్టెక్కించేస్తాడు. మరి ఈసారి ఆ ప్లాన్ ఎంత వరకు వర్కవుట్ అయిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం..!

కథ:
నాని(నాని) తన అన్నయ్య(రాజీవ్ కనకాల) అన్న దమ్ములు. ఇద్దరు సంతోషంగా జీవితం గడుపుతుంటారు. లైఫ్ హ్యాపీ గా సాగుతున్నప్పుడు రాజీవ్ కనకాల, జ్యోతిని (భూమిక) పెళ్లి చేసుకుంటాడు.అన్నయ్య, వదిన తో ఎక్కువ టైం స్పెండ్ చేయడం తనను పట్టించుకోవట్లేదనే భావన నానికి కలుగుతుంది. వదిన తన జీవితాని కి శత్రువు గా భావిస్తూ వుండటం వల్ల, ఆ ఇంట్లో ఉండలేక, వూరు వదిలి వాళ్ళ బాబాయ్ ఇంట్లో సెటిల్ అవుతాడు. నాలుగు సంవత్సరాలు గడిచాక వాళ్ళ అన్న (రాజీవ్ కనకాల) ఒక రోజు నాని ని ఇంటికి పిలుస్తాడు. వదినకు వరంగల్ ట్రాన్స్ఫర్ అయిందని తనతో పాటు నువ్వు కూడా వెళ్లాలని చెబుతాడు. అన్నయ్య రిక్వెస్ట్ కాదనలేక వరంగల్ వెళ్తాడు. అక్కడ నాని, పల్లవి(సాయి పల్లవి) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. మరోపక్క జ్యోతికు వరంగల్ కు చెందిన శివ(విజయ్ వర్మ) అనే రౌడీతో సమస్యలు ఎదురవుతాయి. ఇంతకీ
ఆ సమస్యలు ఏంటి..? ఈ విషయంలో నాని తన వదినకు సహాయం చేశాడా..? అనే విషయాలు తెరపై చూసి తెలుసుకోవాల్సిందే!

ప్లస్ పాయింట్స్:
ఫస్ట్ హాఫ్
నాని
సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్:
కథనం
లవ్ ట్రాక్
సెకండ్ హాఫ్, క్లైమాక్స్

విశ్లేషణ:
ఇప్పటివరకు నాని తిరుగులేని విజయాలను అందుకున్నాడు. కానీ ఈ సినిమాతో అతడి స్పీడ్ కు బ్రేక్ పడినట్లైంది. ఫస్ట్ హాఫ్ వరకు సినిమా ఓకే.. కానీ ఎప్పుడైతే సెకండ్ హాఫ్ మొదలవుతుందో బాగా విసుగుపుతుంది. అసలు నాని నుండి ఇలాంటి సినిమా ఆడియన్స్ ఊహించరు. కథనంలో క్లారిటీ లేకపోవడం, సెంటిమెంట్ ఎక్కువవడంతో సినిమా ఏవరేజ్ టాక్ తో సరిపెట్టుకోవాల్సివచ్చింది.

 

COMMENTS

X