రివ్యూ: ఒక్క క్షణం

రివ్యూ: ఒక్క క్షణం

నటీనటులు: అల్లు శిరీష్, సురభి, శ్రీనివాస్ అవసరాల, సీరత్ కపూర్, దాసరి అరుణ్ కుమార్ తదితరులు
సంగీతం: మణిశర్మ
సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె నాయుడు
ఎడిటింగ్: ఛోటా కె ప్రసాద్
నిర్మాత: చక్రి చిగురుపాటి
దర్శకత్వం: వి.ఐ.ఆనంద్

ఎక్కడిపోతావు చిన్నవాడా లాంటి హర్రర్ థ్రిల్లర్ ను రూపొందించిన విఐ ఆనంద్ దర్శకత్వంలో ఒక్క క్షణం అనే సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ లో నటించాడు. సంబంధం లేని ఇద్దరు వ్యక్తులు జీవితాలు ఒకే విధంగా ఉండటం అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా అల్లు శిరీష్ కు ఎలాంటి విజయాన్ని అందించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం!

కథ:

జీవా (అల్లుశిరీష్) అమ్మా నాన్నలతో సరదాగా కాలం గడిపే జీవాకు ఓ రోజు ఇనార్బిట్ మాల్ లోని బేస్మెంట్ పార్కింగ్ దగ్గర జ్యోత్స్న(సురభి) అనే అమ్మాయి పరిచయం అవుతుంది. తొలి చూపులోనే ఇద్దరు ప్రేమలో పడతారు. వారి ప్రేమను ఇద్దరి కుటుంబ సభ్యులు అంగీకరిస్తారు. తనచుట్టూ ఉన్న మనుషులను చూస్తూ టైం పాస్ చేసే జ్యోకి తమ అపార్ట్‌మెంట్ లోని పక్క పోర్షన్ లో ఉంటున్న శ్రీనివాస్ (అవసరాల శ్రీనివాస్), స్వాతి (సీరత్ కపూర్)ల మధ్య ఏదో జరుగుతుందన్న అనుమానం కలుగుతుంది. అదేంటో తెలుసుకునే ప్రయత్నం చేసిన జీవా, జ్యోత్స్నలకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఏడాది క్రితం శ్రీనివాస్, స్వాతిల జీవితంలో ఏ సంఘటనలు అయితే జరిగాయో అవే సంఘటనలు జీవా, జ్యోత్స్నల జీవితంలో ప్రస్తుత కాలంలో జరుగుతుంటాయి. అదే సమయంలో స్వాతి తన అపార్ట్‌మెంట్ లో హత్యకు గురవుతుంది. ఆ హత్య శ్రీనివాసే చేశాడని పోలీసులు అతన్ని అరెస్ట్ చేస్తారు. దీంతో జీవా తనను చంపుతాడని మరింత భయపడుతుంది జ్యో.. స్వాతిని నిజంగా శ్రీనివాసే చంపాడా..? ఆత్మహత్య చేసుకుందా..? స్వాతి లాగే జ్యోత్స్న కూడా చనిపోతుందా..? విధిని ఎదిరించి చేసే పోరాటంలో జీవా విజయం సాధించాడా..?

ప్లస్ పాయింట్స్:
నటీనటుల పెర్ఫార్మన్స్
నేపధ్య సంగీతం
కథ, కథనాలు

మైనస్ పాయింట్స్:
సాగతీత
క్లైమాక్స్

విశ్లేషణ :
తన ప్రతీ సినిమాను డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ తో రూపొందించే విఐ ఆనంద్ ఈ సారి ప్యారలల్ లైఫ్ అనే సైన్స్‌ఫిక్షన్ కథాంశాన్ని ఎంచుకున్నాడు. ఇద్దరు వ్యక్తుల జీవితాల్లో వేరు వేరు సమయాల్లో ఒకే విధమైన సంఘటనలు జరగటం అనే డిఫరెంట్ కాన్సెప్ట్ ను ఏ మాత్రం కన్ఫ్యూజన్ లేకుండా తెర మీద ఆవిష్కరించటంలో సక్సెస్ సాధించాడు. విభిన్న కథలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది.

COMMENTS

X